తెలంగాణ

telangana

ETV Bharat / international

'మా అణు విధానంలో ఎలాంటి మార్పు ఉండదు' - ఇమ్రాన్​ ఖాన్

పాకిస్థాన్​ అణు విధానంలో ఎటువంటి మార్పు ఉండదని ఆ దేశ విదేశాంగ కార్యాలయం తెలిపింది. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ భారత్​తో యుద్ధం ప్రారంభించబోమని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన చేసింది పాక్ విదేశీ కార్యాలయం.

అణు విధానంలో మార్పులుండవని పాక్ స్పష్టం

By

Published : Sep 3, 2019, 9:51 PM IST

Updated : Sep 29, 2019, 8:30 AM IST

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం పాకిస్థాన్​ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో తెలియక రోజుకో మాట మాట్లాడుతోంది. తాజాగా తమ అణు విధానంలో ఎటువంటి మార్పు ఉండదని పాకిస్థాన్​ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. భారత్​తో ఎటువంటి యుద్ధం ప్రారంభించబోమనిపాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ అన్న కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన చేసింది.

లాహోర్​లోని గవర్నర్ నివాసంలో సిక్కు సంఘం సోమవారం భేటీ అయింది. ఈ భేటీ అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ అణ్వాయుధాలపై స్పందించారు.

"ఇరుదేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నవే. భారత్​- పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది. మెుదటిగా పాక్​ యుద్ధాన్ని ప్రారంభించదు."
-ఇమ్రాన్​, పాక్ ప్రధాని

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత

కశ్మీర్​ ఆర్టికల్​ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్​ అనేక పర్యాయాలు యుద్ధం జరగొచ్చని మాట్లాడారు. అనేక సార్లు పాక్ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పాక్​ ప్రధాని యుద్ధం జరగబోదనే వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

రాజ్​నాథ్ సింగ్​ వ్యాఖ్యలు

అణ్వాస్త్రాలు మొదట ప్రయోగించరాదన్నది ప్రస్తుతం దేశ విధానంగా ఉందన్నారు భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మాత్రం అప్పటి పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని ఇటీవల స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఛత్తీస్​గఢ్​ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అరెస్టు

Last Updated : Sep 29, 2019, 8:30 AM IST

ABOUT THE AUTHOR

...view details