తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్‌లో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ విలీనం! త్వరలో ప్రకటన - గిల్గిత్‌-బాల్టిస్థాన్

వివాదాస్పద గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను తమ దేశంలో విలీనం చేసుకోవాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. చైనా ఒత్తిడి మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ త్వరలో ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారని సమాచారం.

Pakistan decides to formally merge disputed Gilgit-Baltistan
పాక్‌లో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ విలీనం! త్వరలో ప్రకటన

By

Published : Oct 5, 2020, 5:35 AM IST

కరోనా వైరస్‌తో తలెత్తిన అస్థిరతను సొమ్ము చేసుకుంటూ వివాదాస్పద గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను తమ దేశంలో లాంఛనంగా విలీనం చేసుకోవాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. దీని వెనుక చైనా కుట్ర కోణం దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ (జి-బి) స్థాయిని మార్చాలని పాక్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు కశ్మీర్‌ వ్యవహారాల మంత్రి అలీ అమీన్‌ గండాపుర్‌ ఇటీవల విలేకరులతో తెలిపారు. దీనిపై లాంఛనమైన ప్రకటన చేయడానికి ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ త్వరలో ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారని చెప్పారు. నిజానికి జి-బి ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. దీన్ని అలాగే ఉంచేందుకు, తన వాదనలకు చట్టబద్ధత కల్పించేందుకు పాక్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రావిన్షియల్‌ ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిస్తోంది. తరచూ విధానపరమైన మార్పులను చేయడం ద్వారా జి-బి రాజ్యాంగ హోదాపై ఉద్దేశపూర్వకంగా అస్పష్టతను కలిగించింది.

అత్యంత కీలకం..

జి-బి.. ఆసియాలో అత్యంత కీలక ప్రదేశం. మూడు అణ్వస్త్ర దేశాలైన భారత్‌, పాకిస్థాన్‌, చైనాల సరిహద్దులు కలిసే చోటు ఇదే. మధ్య ఆసియా, నైరుతి ఆసియా, దక్షిణాసియా సహా అనేక ప్రాంతాలను ఇది అనుసంధానం చేస్తోంది. అందువల్ల చైనా విస్తరణవాద ప్రణాళికలో ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌) ప్రాజెక్టును సాఫీగా పూర్తి చేయడానికి. ఈ ప్రాంతంలో చైనా టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడానికి అంతిమంగా దీన్ని తన వలసరాజ్యంగా మార్చుకోవడానికి వీలుగా జి-బిని పూర్తిగా పాక్‌లో విలీనం చేయించడం మేలని చైనా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు పాక్‌పై ఒత్తిడి పెంచి, ఫలితాన్ని రాబడుతోందని తెలిపారు. జి-బి.. ఎప్పుడూ ఏకీకృత జమ్మూ-కశ్మీర్‌లో భాగంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు సిక్కులు పాలించారు. 1845-46 నాటి యుద్ధం తర్వాత ఇది బ్రిటిషు వారి చేతుల్లోకి వెళ్లిపోయింది.

ABOUT THE AUTHOR

...view details