తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్​'పై పాకిస్థాన్​- చైనా విస్తృత చర్చలు - KASHMIR

చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీ పాకిస్థాన్​లో రెండు రోజులపాటు పర్యటించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్​ అంశంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చైనా సూచించింది.

'కశ్మీర్​'పై పాకిస్థాన్​- చైనా విస్త్రత చర్చలు

By

Published : Sep 9, 2019, 5:15 AM IST

Updated : Sep 29, 2019, 10:57 PM IST

'కశ్మీర్​'పై పాకిస్థాన్​- చైనా విస్త్రత చర్చలు

కశ్మీర్​ అంశాన్ని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించి భంగపాటుకు గురైన పాకిస్థాన్​​... తాజాగా ఇదే విషయంపై తన మిత్రదేశం చైనాతో చర్చలు జరిపింది. కశ్మీర్​ ప్రాంతంపై ఉన్న వివాదాలను పరస్పర గౌరవం, సమానత్వంతో కూడిన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. కశ్మీర్​ సార్వభౌమత్యాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కృషి చేయనున్నట్టు పాక్​కు చైనా హామీనిచ్చింది.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ రెండు రోజుల పాకిస్థాన్​ పర్యటన ముగిసిన అనంతరం అధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలపై ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావం చూపవని ఇరు దేశాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.

రెండు రోజుల పర్యటనలో భాగంగా పాక్​ విదేశాంగ మంత్రి మహమూద్​ ఖురేషితో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృత చర్చలు జరిపారు వాంగ్​.

కశ్మీర్​ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తిన పాక్​... వాంగ్​కు తాజా పరిస్థితులను వివరించింది. ఐరాస భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి సూచించారు.

ఇదీ చూడండి:- పాపం పాకిస్థాన్​..! యూనిసెఫ్​లోనూ భంగపాటే

Last Updated : Sep 29, 2019, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details