తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉపరితల క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్ - పాక్​

ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది పాకిస్థాన్. ఈ విషయాన్ని పాక్ సైన్యాధికారి ట్విట్టర్​లో వెల్లడించారు.

భూఉపరితల క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన పాక్

By

Published : Aug 29, 2019, 2:14 PM IST

Updated : Sep 28, 2019, 5:46 PM IST

బుధవారం పాకిస్థాన్​ ఓ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి 'ఘజ్నవి'ని ప్రయోగించినట్లు పాక్ సైన్యం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. భారత్​- పాక్​ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష చర్చనీయాంశమైంది.

కరాచీ గగనతలాన్ని బుధవారం మూసివేసిన పాకిస్థాన్.. ఈ పరీక్షను చేపట్టింది. ఈ క్షిపణికి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉందని పాక్​ సైన్యం వివరించింది.

బుధవారం రాత్రి ఈ ప్రయోగం చేపట్టినట్లు పాకిస్థాన్ సైన్యం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​, అధ్యక్షుడు అరీఫ్ అల్వీ ప్రయోగం నిర్వహించిన బృందాన్ని అభినందించారు.

ఇదీ చూడండి: భారత్​కు పాక్ గగనతలాన్ని మూసేయలేదు: ఖురేషీ

Last Updated : Sep 28, 2019, 5:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details