పాకిస్థాన్‌లో జైషే మహ్మద్‌కు చెందిన 9 శిబిరాలతో పాటు మొత్తం 22 ఉగ్రవాద శిబిరాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయన్నారు భారత సీనియర్ అధికారి. ఉగ్రవాద కార్యకలాపాలు భారత సరిహద్దు దాటి వస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. బాలాకోట్ తరహాలోనే మరో వైమానిక దాడి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
''ఉగ్రవాదానికి పాక్ అంతర్జాతీయ కేంద్రంగా మారింది. పాక్ భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. పాకిస్థాన్ నాయకత్వం.. 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధ పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. పాక్‌లో ఇంకా 22 ఉగ్రశిబిరాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇందులో 9 జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవి.''
- భారత సీనియర్ అధికారి.
ఫిబ్రవరి 14 పుల్వామా దాడికి ప్రతిగా భారత వాయుసేన పాకిస్థాన్‌కు గట్టిగా బదులిచ్చింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడి జరిపింది.
బాలాకోట్ వైమానిక దాడి... ఉగ్రవాదంపై పోరుకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలకు లోబడే జరిగిందని ఆ అధికారి స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని నియంత్రించకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. కరాచీలో ఎమర్జెన్సీ విధించటం, విమానాశ్రయాల మూసివేత, పుకార్లు వంటివి ఇందులో భాగమని వివరించారు.