తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ దిద్దుబాటు చర్యలు - మసీదు

సింధ్ రాష్ట్రంలోని ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలను పాకిస్థాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జమాత్​ ఉద్​ దావా, ఫలా ఈ ఇన్సానియత్ ఫౌండేషన్​లకు చెందిన అన్ని భవనాలను జప్తు చేసింది పాక్ ప్రభుత్వం.

హఫీజ్ సయీద్

By

Published : Mar 7, 2019, 11:29 PM IST

పాకిస్థాన్​లోని ​ఉగ్రసంస్థలు జమాత్​ ఉద్​ దావా(జేయూడీ), ఫలా ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్​ఐఎఫ్)కు చెందిన 56 భవనాలను అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి ఆధ్వర్యంలో నడుస్తున్న మసీదులు, మదర్సాలను సైతం జప్తు చేసింది.

దీనిపై సింధ్​ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వాధీనం చేసుకున్న మదర్సాలు, మసీదులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపింది.

పాకిస్థాన్ జాతీయ ఉగ్రవాద నిరోధక సంస్థ(నాక్టా) జాబితాలోని 70 సంస్థలో జేయూడీ, ఎఫ్​ఐఎఫ్​ ప్రముఖమైనవి. వీటి కింద 50వేల మంది వలంటీర్లు, వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రెండు సంస్థలు ఉగ్రవాద నిరోధక చట్టం-1997ను ఉల్లంఘించాయని ప్రభుత్వం పేర్కొంది.

జేయూడీ వ్యవస్థాపకుడు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​. అమెరికా ప్రభుత్వం సయీద్​ను 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, అతని తలపై 10 మిలియన్​ డాలర్ల రివార్డును ప్రకటించింది. ఐరాస 1267 జాబితాలోనూ సయీద్​ పేరును చేర్చారు.

పుల్వామా ఉగ్రదాడితో ప్రారంభమైన ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్​పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. ఫలితంగా దిద్దుబాటు చర్యలకు పాకిస్థాన్​ ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటికే నాక్టా చట్టం కింద 70 ఉగ్రవాద సంస్థలను నిషేధించింది. సుమారు 44 మంది తీవ్రవాదులను అరెస్టు చేసింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్​ అజర్​ కొడుకు, సోదరుడు సైతం ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details