తెలంగాణ

telangana

ETV Bharat / international

పీఓకేలో వివాదాస్పద డ్యామ్ పనులను ప్రారంభించిన పాక్ - పీఓకేలో వివాదాస్పద డ్యామ్ పనులను ప్రారంభించిన పాక్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్​లో డయామర్ బాషా డ్యామ్ పనులను ప్రారంభించింది. చైనా మద్దతుతో నిర్మితమవుతున్న ఈ మెగా ప్రాజెక్టుపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమంగా ఆక్రమించిన ప్రాంతంలో ఆనకట్టలు నిర్మించడం తగదని హెచ్చరించింది.

imran
పీఓకేలో వివాదాస్పద డ్యామ్ పనులను ప్రారంభించిన పాక్

By

Published : Jul 16, 2020, 5:32 AM IST

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని డయామర్‌బాషా ఆనకట్ట నిర్మాణ పనులను పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రారంభించారు. చైనా మద్దతుతో నిర్మితమవుతున్న ఈ మెగా ప్రాజెక్టుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా గిల్గిట్‌ బాల్టిస్థాన్‌లోని చిలాస్‌ వద్ద నిర్వహించిన సభలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్‌ తార్బెలా, మంగ్లా తర్వాత డయామర్‌బాషా ఆనకట్ట పాక్‌లోనే మూడో అతిపెద్ద ఆనకట్టగా అవతరించనుందని వ్యాఖ్యానించారు.

4,500 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 2028 కల్లా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆనకట్ట నిర్మాణం కోసం చైనా ప్రభుత్వ రంగ సంస్థ, పాకిస్థాన్ మిలిటరీ వాణిజ్య విభాగంతో చేసుకున్న 442 బిలియన్ డాలర్ల ఒప్పందంపై మేలో పాక్‌సర్కారు సంతకం చేసింది. ఆనకట్టను నిర్మించే కన్సార్టియంలో చైనా ప్రభుత్వ రంగ సంస్థ చైనా పవర్‌కు 70 శాతం వాటా ఉండగా పాకిస్థాన్ సాయుధ దళాల వాణిజ్య విభాగం ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ 30 శాతం వాటాను కలిగి ఉంది.

ఈ ప్రాజెక్టు ఒప్పందం కుదిరిన సమయంలోనూ భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్‌ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతంలో ఆనకట్టలు నిర్మించడం తగదని హెచ్చరించింది.

ఇదీ చూడండి:వీసా కొత్త రూల్స్​పై ట్రంప్ క్లారిటీ- ఇక వారికే ఎంట్రీ!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details