తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​పై సౌదీ మద్దతుకు పాక్​ మరోసారి ప్రయత్నం! - ఇమ్రాన్​ ఖాన్​

పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ ఈనెల ఆఖర్లో మరోమారు సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు. కశ్మీర్​ అంశంలో భారత్​-పాక్​​ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇమ్రాన్​ సౌదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

కశ్మీర్​పై సౌదీ మద్ధతుకు పాక్​ మరోసారి ప్రయత్నం!

By

Published : Sep 12, 2019, 9:17 PM IST

Updated : Sep 30, 2019, 9:37 AM IST

కశ్మీర్​ అంశంలో అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు పాకిస్థాన్​ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈనెల ఆఖర్లో సౌదీ పర్యటనకు పాక్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ వెల్లనున్నట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండు సార్లు సౌదీలో పర్యటింటిన ఇమ్రాన్​.. కశ్మీర్​పై మరోమారు సౌదీ ముఖ్యనేతలతో మంతనాలు చేయనున్నారు. భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాక్​ ప్రధాని సౌదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

సెప్టెంబర్​ 27 ఐరాస వార్షిక సదస్సులో ప్రసంగించనున్న నేపథ్యంలో అమెరికా పర్యటనకు ముందే ఇమ్రాన్​.. సౌదీకి వెళ్లనున్నట్లు ఓ టీవీ ఛానెల్​​ తెలిపింది. ఈ పర్యటనలో సౌదీలోని ముఖ్యనేతలతో ఇమ్రాన్​ సమావేశమై కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఈనెల ప్రారంభంలో సౌదీ రాజధాని రియాద్​లో ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్​ అల్​ జుబెయిర్​, సౌదీలో పాకిస్థాన్​ రాయబారి అరబియా రాజా అలీ ఇజాజ్​ సమావేశమయ్యారు. ఇమ్రాన్​ పర్యటనపై చర్చించారు.

మాకు మద్దతు...

సౌదీ విదేశాంగ మంత్రితో పాటు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్​ అబ్దుల్లా బిన్​ జయెద్​ బిన్​ సుల్తాన్​ అల్​ నహ్యాన్​ సెప్టెంబర్​ 4న పాకిస్థాన్​లో పర్యటించారు. పాక్​ ప్రధాని ఇమ్రాన్​తో పాటు ఇతర నేతలతో కశ్మీర్​ అంశంపై చర్చించారు. అనంతరం కశ్మీర్​ అంశం ముస్లింలకు సంబంధించిన సమస్య కాదని వారు పేర్కొన్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను పాక్​ విదేశాంగ శాఖ ఖండించింది. యూఏఈ, సౌదీలు కశ్మీర్​ విషయంలో తమకు మద్దతు పలికారని పేర్కొంది.

ఇదీ చూడండి: పీఓకేలో... కశ్మీర్​పై ఇమ్రాన్​ఖాన్ 'విధాన ప్రకటన'

Last Updated : Sep 30, 2019, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details