తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత మీడియాను సన్మానిస్తాం : పాక్ సైన్యం - Balakot

పాకిస్థాన్​ మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టింది. బాలాకోట్​పై భారత వైమానిక దళం చేసిన దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. నిజానిజాలు తెలుసుకునేందుకు భారత మీడియా బాలాకోట్​ వస్తే సన్మానిస్తామని ప్రకటించింది.

భారత మీడియాను సన్మానిస్తాం : పాక్ సైన్యం

By

Published : Apr 30, 2019, 6:32 AM IST

Updated : Apr 30, 2019, 6:59 AM IST

భారత మీడియాను సన్మానిస్తాం : పాక్ సైన్యం

బాలాకోట్​పై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో ఎలాంటి నష్టం జరగలేదని మరోసారి బుకాయించింది పాకిస్థాన్​ సైన్యం. ఈ విషయంలో భారత్​ పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. నిజానిజాలు తెలుసుకునేందుకు భారత పాత్రికేయులెవరైనా బాలాకోట్​కు వస్తే వారిని సన్మానిస్తామని ప్రకటించింది.

పాకిస్థాన్​ రావల్​పిండిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పాక్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్​ జనరల్​ ఆసిఫ్​ గఫూర్​. పాకిస్థాన్​ చేసిన ఎదురుదాడిలో ఏం జరిగిందో భారత్​ చెప్పడం లేదని గఫూర్​ ఆరోపించారు. పాక్​ తన తీరును మార్చుకోవాలని మమ్మల్ని కోరే బదులు పాక్​పై భారత్​ తన తీరును మార్చుకోవాలన్నారు.

"గత రెండు నెలలుగా భారత్​ అబద్ధాలాడుతూనే ఉంది. ఓ బాధ్యత గల దేశంగా మేము అలాంటి అసత్య వార్తలకు స్పందించం. నిజమేంటంటే పుల్వామాలో సైనికులపై దాడి జరిగింది. బాలాకోట్​లో మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. స్థానిక, విదేశీ మీడియాను అక్కడికి తీసుకెళ్లి నిజాలేంటో భారత్​కు చూపిస్తాం. ఒకవేళ భారత పాత్రికేయులు కూడా బాలాకోట్​కు రావాలని భావిస్తే వారిని మేము సన్మానిస్తాం."
- మేజర్​ జనరల్​ ఆసిఫ్​ గఫూర్, పాక్​ సైన్యం అధికార ప్రతినిధి

Last Updated : Apr 30, 2019, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details