తెలంగాణ

telangana

ETV Bharat / international

రక్షణ బడ్జెట్ తగ్గింపునకు పాక్ సైన్యం నిర్ణయం

రాబోయే 2019-20 వార్షిక బడ్జెట్​లో రక్షణ వ్యయాన్ని తగ్గించుకోవాలని పాకిస్థాన్ సైన్యం స్వీయ నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

రక్షణ బడ్జెట్ తగ్గింపునకు పాక్ సైన్యం నిర్ణయం

By

Published : Jun 5, 2019, 6:56 PM IST

Updated : Jun 5, 2019, 8:32 PM IST

రక్షణ బడ్జెట్ తగ్గింపునకు పాక్ సైన్యం నిర్ణయం

జూన్ 11న 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్​లో రక్షణ బడ్జెట్​ను తగ్గించుకోవాలని పాకిస్థాన్ సైన్యం స్వీయ నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్​ను తగ్గించుకునేందుకు మొగ్గు చూపింది. రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్​ కేటాయింపులు తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది.

"రక్షణ బడ్జెట్​లో ఒక సంవత్సరం తగ్గింపులు జరిపితే భద్రత, రక్షణపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎదురయ్యే అన్ని సవాళ్లను మేం సమర్థంగా తిప్పికొట్టగలం. సరైన అంతర్గత చర్యల ద్వారా త్రివిధ దళాలు సమర్థంగా పనిచేయగలవు. గిరిజన ప్రాంతాలు, బలూచిస్థాన్​లో అభివృద్ధి ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యాంశం."

-మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, డైరెక్టర్ జనరల్, అంతర్గత సేవలు, ప్రజాసంబంధాలు

అయితే ఎంత మేరకు రక్షణ నిధులను తగ్గించుకుంటారో గఫూర్ వెల్లడించలేదు.

ఇమ్రాన్ హర్షం

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైన్యం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. దేశం ఆర్థిక సమస్యల్లో ఉండగా పాక్ సైన్యం అద్భుతమైన నిర్ణయం తీసుకుందన్నారు. భద్రతా సవాళ్లు నెలకొన్న పరిస్థితుల్లోనూ సైన్యం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

రక్షణ బడ్జెట్​ తగ్గడం ద్వారా మిగిలిన నిధులను గిరిజన ప్రాంతాలు, బలూచిస్థాన్ అభివృద్ధికై కేటాయిస్తామని ఇమ్రాన్​ఖాన్ వెల్లడించారు.

గతేడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు ఇమ్రాన్. తన సొంత ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మూడు గదుల ఇంట్లోకి మారారు.

రాబోయే బడ్జెట్​లో కఠిన నిర్ణయాలుంటాయన్నారు ప్రధాని ఆర్థిక సలహాదారు హఫీజ్​ షేక్.

"రానున్న బడ్జెట్​లో కఠిన నిర్ణయాలుంటాయి. ప్రభుత్వ ఖర్చును కనీస స్థాయికి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం."

-హఫీజ్​ షేక్, ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారు

గతేడాది గరిష్ఠం

గతేడాది బడ్జెట్​లో రక్షణకు జీడీపీలో 4 శాతం నిధులను కేటాయించింది. రక్షణకు నిధుల కేటాయింపుల్లో 2004 నుంచి ఇదే అత్యంత ఎక్కువ.

Last Updated : Jun 5, 2019, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details