తెలంగాణ

telangana

ETV Bharat / international

'హిందూ ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలి'

గత డిసెంబర్​లో పాకిస్థాన్​లో కొందరు దుండగులు కూల్చిన హిందూ దేవాలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓ గడువును నిర్దేశించుకొని తమకు తెలియజేయాలని ప్రభుత్వానికి చెప్పింది.

Pak court orders rebuilding of vandalised temple, seeks timeline for work
కూల్చేసిన ఆలయాన్ని వెంటనే పునర్మించాలి: పాక్ సుప్రీం కోర్టు

By

Published : Feb 9, 2021, 8:10 PM IST

పాకిస్థాన్‌ ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని హిందూ దేవాలయం పునర్​నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో నివేదించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గతేడాది డిసెంబర్​లో రాడికల్‌ ఇస్లామిక్‌ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు కారక్​ జిల్లాలోని ఓ హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున్న ఉద్రిక్తతలు తలెత్తాయి.

దశాబ్దాల నాటి ఈ ఆలయ పునరుద్ధరణ పనులకు స్థానిక అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గత వారం జమైత్ ఉలేమా-ఈ-ఇస్లామ్‌ పార్టీ నేతృత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు 350 మందిపై కేసు నమోదు చేశారు.

ఆలయ పునర్నిర్మాణ పనులకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు.. దాడి వల్ల జరిగిన నష్టాన్ని దీనికి కారణమైన వారి నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:'పాక్​లో గుడి కూల్చివేత'లో పోలీసు కస్టడీకి 56 మంది

ABOUT THE AUTHOR

...view details