2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముష్కరులకు నిధులు సమకూరుస్తున్నట్లు పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు బుధవారం సయీద్‌పై అభియోగాలు మోపింది. సయీద్, అతడి అనుచరులు పాకిస్థానీ పంజాబ్‌లోని వివిధ నగరాల్లో టెర్రర్ ఫైనాన్సింగ్‌కు (ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం) పాల్పడినట్లు న్యాయమూర్తి మాలిక్ అర్షద్ భుట్టా తెలిపారు.
అరెస్టు... విచారణ
హఫీజ్‌ను ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలపై జులై 17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. లాహోర్ ఉగ్రవాద నిరోధక కోర్టు.. సయీద్ దురాగతాలపై డిసెంబర్ 7న విచారణ జరిగింది. అయితే అధికారులు సహ నిందితులను ప్రవేశపెట్టని కారణంగా విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. నేడు సయీద్‌పై అభియోగాలు నమోదు చేసింది.