తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2019, 3:36 PM IST

ETV Bharat / international

పాక్​ 'కుట్రల కవాతు'.. నియంత్రణ రేఖ దాటి వస్తారా?

ఆర్టికల్​ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్​... కశ్మీర్​లో అలజడి సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నిరసన ర్యాలీ పేరిట సరికొత్త కుట్ర పన్నింది. పాక్ ఆక్రమిత కశ్మీర్​ నుంచి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు నియంత్రణ రేఖ దిశగా వస్తున్నారు.

పాక్​ 'కుట్రల కవాతు'.. నియంత్రణ రేఖ దాటి వస్తారా?

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370 రద్దుపై 'నిరసన కవాతు' పేరిట సరికొత్త నాటకానికి తెరలేపింది పాకిస్థాన్​. పాక్ ఆక్రమిత కశ్మీర్​కు చెందిన అనేక మంది... నియంత్రణ రేఖ దిశగా ర్యాలీగా వస్తున్నారు.

జమ్ముకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​(జేకేఎల్​ఎఫ్​) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగుతోంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్​లో బయలుదేరిన నిరసనకారులు శనివారం గఢీ దుపట్టాకు చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. ప్రస్తుతం ముజఫరాబాద్​-శ్రీనగర్ రహదారిపై ర్యాలీ కొనసాగిస్తున్నారు.

గీత దాటతారా...?

నియంత్రణ రేఖ దాటవద్దని నిరసనకారులను శనివారం హెచ్చరించారు పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. కశ్మీరీలకు సాయం అందించాలనో, లేక మద్దతు తెలపాలనో గీత దాటితే... భారత్​ దీనిని సాకుగా చూపి, ఎదురుదాడి చేసే ప్రమాదముందని చెప్పారు.

నిరసనకారులు మాత్రం తాము నియంత్రణ రేఖ దాటి తీరతామని ప్రకటించారు. అయితే... వారు ఛకోతీకి చేరుకోగానే పాక్ అధికార యంత్రాంగం అడ్డుకునే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:ఆ కుటుంబంలో ఎవరూ మిగలలేదు, ఏం జరిగింది..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details