పాకిస్థాన్ బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌లో ఓ హోటల్‌పై దాడికి తెగబడిన ముష్కరులను ఆ దేశ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సాయంకాలం హోటల్లోకి చొచ్చుకొచ్చే ఉగ్రవాదులను నిలువరించేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును ముష్కరులు కాల్చి చంపారు. హోటల్‌కు విచ్చేసిన కొందరు అతిథులకు సైతం గాయాలయ్యాయని బలూచిస్థాన్ రాష్ట్ర హోంమంత్రి ప్రకటించారు.
ఉగ్రదాడి తమ పనేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) తీవ్రవాద సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. గతేడాది చైనా విదేశాంగ శాఖ కార్యాలయంపై సైతం బీఎల్ఏ దాడులకు తెగబడింది.