పాకిస్థాన్ సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను (ISI Chief Faiz Hameed) పెషావర్ కోర్ కమాండర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన చీఫ్‌గా నదీమ్ అంజుమ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో హమీద్‌కు ఈ కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ బదిలీ.. అదే కారణమా? - పాకిస్థాన్ కొత్త చీఫ్
ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్‌ను (ISI Chief Faiz Hameed) పెషావర్ కోర్ కమాండర్‌గా బదిలీ చేసింది పాకిస్థాన్ సైన్యం. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో హమీద్‌కు ఈ కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
d
మాజీ చీఫ్ హమీద్.. 2019 జూన్ 16న ఐఎస్ఐ చీఫ్‌గా (ISI Chief Faiz Hameed) బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఐఎస్ఐలో అంతర్గత భద్రతా అధిపతిగా పనిచేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బజ్వాకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న హమీద్.. అనేక బాహ్య, అంతర్గత భద్రతా సవాళ్ల నడుమ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తాలిబన్ల ఆధ్వర్వంలో ఏర్పడిన అఫ్గాన్ ప్రభుత్వం విషయంలో హమీద్ ప్రధాన పాత్ర పోషించారు.
ఇదీ చూడండి :తాలిబన్ల క్రూరత్వం.. క్రేన్లకు మృతదేహాలు.. గురుద్వారాపై దాడులు