తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ దెబ్బకు దిగొచ్చిన పాక్- సైనిక చట్టానికి సవరణ! - pakisthna military news

అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా భారత మాజీ నావికాదళ అధికారి కుల్​భూషణ్​ యాదవ్​కు.. పౌర న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఏర్పాటు చేస్తోంది పాకిస్థాన్. ఇందుకోసం సైనిక చట్టానికి సవరణ చేస్తున్నట్లు పాక్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

భారత్​ దెబ్బకు దిగొచ్చిన పాక్- సైనిక చట్టానికి సవరణ!

By

Published : Nov 13, 2019, 3:05 PM IST

భారత్​ ఒత్తిడికి పాకిస్థాన్​ తలొగ్గింది. పాక్​ చెరలో ఉన్న భారత మాజీ నావికాదళ అధికారి కుల్​భూషణ్ జాదవ్​కు పౌర న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు కల్పించాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఆదేశం అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం పాక్​ సైనిక చట్టానికి సవరణలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియాలో వార్తలొస్తున్నాయి.

పాక్ సైనికుల చెరలో ఉన్న విదేశీ వ్యక్తులకు మిలిటరీ కోర్టులో అప్పీల్ చేసుకునే వీలు మాత్రమే ఉంది. పౌర న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేదు. అయితే కుల్​భూషణ్​ జాదవ్ కేసులో ఐసీజే ఆదేశాన్ని అమలు చేయాలంటే సైనిక చట్టానికి సవరణ చేయక తప్పని పరిస్థితి. అందువల్ల ఆ చట్టానికి ప్రత్యేక మార్పులు చేస్తోంది పొరుగు దేశం.

ఇదీ చూడండి:శివసేన ముందు అగ్నీపథ్​.. ఆస్పత్రి నుంచి రౌత్ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details