నిఘావర్గాల సమాచారం ఆధారంగా పాక్‌లోని బలూచిస్థాన్‌లో భారీ మిలిటరీ ఆపరేషన్‌ను నిర్వహించింది ఆ దేశ సైన్యం. ఈ దాడిలో ఓ పాక్ సైనికుడు సహా.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రకటించింది.
"పౌరులతో పాటు భద్రతా దళాలపై హింస, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఇద్దరు ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. ఘటనా స్థలం నంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం."
-పాక్ సైన్యం