ప్రధాని నరేంద్ర మోదీ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు నిరాకరించిన పాకిస్థాన్‌ను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) సుతిమెత్తగా హెచ్చరించింది. జాతీయ నాయకులను తీసుకెళ్లే విమానాలను 'స్టేట్ ఎయిర్‌క్రాఫ్ట్'గా పరిగణిస్తారని, చికాగో ఒడంబడిక ప్రకారం ఈ విమానాలకు నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది.
"కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ (చికాగో కన్వెన్షన్) నిబంధనలు కేవలం పౌర విమాన కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ నిబంధనలు జాతీయ నాయకులు ప్రయాణించే విమానాలకు, సైనిక విమానాలకు మాత్రం వర్తించవు."
- ఐసీఏఓ అధికార ప్రతినిధి
భారత్ ఫిర్యాదు..