కారు బాంబు పేలుడులో 8 మంది మృతిచెందిన ఘటన అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మరో 15 మందికి గాయాలైనట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షతగాత్రుల్లో ఎంపీ మహ్మద్ ఖాన్ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.