కరోనాను కట్టడి చేశామని, తమ దేశంలో ఒక్క వైరస్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకొస్తున్న ఉత్తర కొరియా.. ఇప్పుడు అసలు తమకు టీకాలే అవసరం లేదంటోంది. యూఎన్ ఆధ్వర్యంలోని కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా ఉత్తర కొరియాకు పంపిణీ చేసే వ్యాక్సిన్లను (North korea vaccine) కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాలకు సరఫరా చేయమని యూఎన్కు ప్రతిపాదించింది. ఈ విషయాన్ని యూనిసెఫ్ వెల్లడించింది.
వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా యూనిసెఫ్.. 29.7 లక్షల సినోవాక్ టీకా డోసులను ఉత్తర కొరియాకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ వ్యాక్సిన్లు తమకు అవసరం లేదంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. భవిష్యత్తులో అవసరమైతే సంప్రదిస్తామంటూ ఆరోగ్య శాఖ పేర్కొందని యూనిసెఫ్ వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర కొరియాకు 19 లక్షల డోసులను యూఎన్ కేటాయించింది.
వ్యాక్సిన్లు అంటే లెక్కేలేదు..