North Korea Missile launch: ఉత్తర కొరియా మళ్లీ ఉద్రిక్తతలు రాజేసింది. మరోసారి క్షిపణి ప్రయోగాలు చేసింది. గురువారం రెండు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఇది జనవరి నెలలో జరిగిన ఆరో ప్రయోగమని తెలిపారు.
తాజా క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించారని సైనికాధికారులు తెలిపారు. అవి ఎంతదూరం ప్రయాణించాయనేది తెలియలేదని చెప్పారు. స్వల్పశ్రేణి క్షిపణులను ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు.
North Korea Nuclear test: ఉత్తర కొరియా ఇటీవల ఆయుధ పరీక్షలను విస్తృతం చేసింది. జనవరి ప్రారంభంలో హైపర్సోనిక్ మిసైల్ పరీక్షలు నిర్వహించింది. రైలు నుంచీ క్షిపణులను ప్రయోగించింది. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈ ప్రయోగాలు చేపట్టిందని నిపుణులు చెబుతున్నారు.