ప్రపంచంలో ఏం జరుగుతున్నా.. తమ రూటే సపరేటు అని మరోమారు రుజువుచేసింది ఉత్తరకొరియా. ఓవైపు ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పై పోరుకు ఐకమత్యమే అస్త్రంగా ఒక్కటవుతుంటే... ఉత్తరకొరియా మాత్రం ఎప్పటిలాగే క్షిపణుల ప్రయోగంతో వార్తల్లో నిలుస్తోంది.
కిమ్ ప్రభుత్వం తాజాగా బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించినట్టు దక్షిణ కొరియా ఆరోపించింది. ఉత్తర కొరియాలోని తూర్పు తీర ప్రాంతమైన వోన్సాన్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణులు.. కొరియన్ ద్వీపకల్పం- జపాన్ మధ్యలో ఉన్న సముద్రంలో పడినట్టు తెలిపింది. ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలోనూ కిమ్ ఇలాంటి చర్యలు చేపట్టడం తగదని హితవు పలికింది. తక్షణమే కిమ్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేసింది దక్షిణ కొరియా.