కరోనా పేరుతో ఉత్తర కొరియా.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించాయి ఎనిమిది పాశ్చాత్య దేశాలు. సొంత ప్రజలపై అనుచిత వైఖరి ప్రదర్శిస్తూ.. వారి హక్కులను కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం కాలరాస్తోందని పేర్కొన్నాయి. వర్చువల్గా జరిగిన యూఎన్ భద్రతా మండలి రహస్య సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాయి.
కౌన్సిల్ సభ్యులైన జర్మనీ, బెల్జియం, డొమినిక్ రిపబ్లికన్, ఎస్టోనియా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా దేశాలతో పాటు జపాన్ ఈ ప్రకటనను విడుదల చేశాయి. తమ ప్రజలపై అణ్వాయుధ శక్తి, సైనిక బలాన్ని ఉత్తర కొరియా రుద్దుతోందని వెల్లడించాయి.