తెలంగాణ

telangana

ETV Bharat / international

"యుద్ధం వద్దు"

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయక ముందే ఇరు దేశాల ప్రధానులు శాంతి చర్యలు చేపట్టాలని 59 మంది నోబెల్ శాంతి​ పురస్కార గ్రహీతలు కోరారు.

యుద్ధం వద్దు

By

Published : Mar 4, 2019, 8:51 AM IST

భారత్ - పాకిస్థాన్​ దేశాల ప్రధానులు సరైన ఆలోచనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నోబెల్​ శాంతి పురస్కార గ్రహీతలు. ఈ మేరకు ఐరాసలోని ఇరు దేశాల శాశ్వత ప్రతినిధులకు లేఖ రాశారు. 50కోట్ల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యుద్ధ వాతవరణ పరిస్థితులను చక్కదిద్దాలని 59 మంది శాంతి పురస్కార గ్రహీతలు లేఖపై సంతకాలు చేశారు.

వివిధ విభాగాల్లో శాంతి పురస్కారం పొందిన 59 మంది ఏకాభిప్రాయంతో లేఖ రాయడం ఇదే తొలిసారి.

భారత్​కు చెందిన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్​ సత్యార్థి నెలకొల్పిన 'లారిఏట్స్ అండ్ లీడర్స్​ ఫర్​ చిల్డ్రన్​' వేదిక ద్వారా ఈ లేఖను పంపారు.

"బాలల శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​లు వివేకమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తక్షణమే శాంతింపజేయాలి. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో హింస, అతివాదం, ఉగ్రవాదానికి చోటు లేదు. అంటువ్యాధి లాంటి వీటిని శాశ్వతంగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. "

- లేఖలో నోబెల్​ గ్రహీతలు

ABOUT THE AUTHOR

...view details