Plane Crash Survivors: సోమవారం చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఆందోళనకర విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో సిబ్బంది సహా 132 మంది ఉన్నప్పటికీ... ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా తెలియలేదని అధికారులు తెలిపారు. అనేక గంటలుగా గాలింపు చేపడుతున్నా.. ఎలాంటి ఆశాజనక పరిస్థితులు కన్పించడం లేదని పేర్కొన్నారు. సహాయక చర్యలు మాత్రం యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే 132మంది పరిస్థితిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రమాదానికి గల కారణాన్ని తెలిపే బ్లాక్‌బాక్స్ ఆచూకీపై కూడా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనపై దర్యాప్తులో చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ తెలిపింది.
ఈ ప్రమాదంతో చైనా ఎయిర్‌లైన్స్ రికార్డుకు కూడా బ్రేక్ పడింది. వరుసగా 100 మిలియన్ గంటలకు పైగా ఆ దేశంలో ఎలాంటి విమాన ప్రమాద ఘటన జరగలేదు. 2010లో చివరి సారి హిలాంగ్జియాంగ్ రాష్ట్రంలో జరిగిన విమాన ప్రమాద ఘటనలో 42 మంది చనిపోయారు.
సోమవారం ఘటన..