భారతదేశానికి తమ గగనతలాన్ని మూసివేయలేదని, ఇంకా ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీ స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని కోణాలను పరిశీలించి.. సంప్రదింపులు, చర్చలు జరిపిన తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ విమానాలు ప్రయాణించకుండా... పాక్ తన గగనతలాన్ని మూసివేసిందన్న వార్తలను ఖురేషీ కొట్టిపారేశారు. ఇటీవలే జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చిందని.. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీసుకుంటారని ఖురేషీ స్పష్టం చేశారు.
పొంతనలేని ప్రకటనలు..
పాక్ శాస్త్ర,సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ట్విట్టర్ వేదికగా భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. భారతదేశానికి.. తమ గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పాక్ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.