తెలంగాణ

telangana

ETV Bharat / international

'నీరవ్​ను రప్పించి తీరతాం'

నీరవ్​మోదీని రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్​ కుమార్​ తెలిపారు.

నీరవ్​ మోదీని రప్పించేందుకు చర్యలు

By

Published : Mar 9, 2019, 5:28 PM IST

పీఎన్​బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్​మోదీని తిరిగి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్​కుమార్​ తెలిపారు. అప్పగింత విన్నపాన్ని బ్రిటన్​ ప్రభుత్వం​ పరిశీలిస్తోందని చెప్పారు.

నీరవ్​ మోదీని రప్పించేందుకు చర్యలు

గత సంవత్సరం ఆగస్టులో ఈడీ, సీబీఐ నుంచి వచ్చిన సమాచారంతో నీరవ్​ మోదీని అప్పగించాలని బ్రిటన్​ ప్రభుత్వాన్ని కోరాం. యూకే మన ప్రతిపాదనపై స్పందించాల్సి ఉంది లేదా ఇంకా పరిశీలనలోనే ఉంది.
- రవీష్​ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

అద్దె 15 లక్షలు, చొక్కా 10 లక్షలు...

నీరవ్​ మోదీ బ్రిటన్​లో 80 లక్షల డాలర్లు విలువచేసే విలాసవంతమైన అపార్టమెంట్​లో నివాసం ఉంటున్నట్లు శనివారం బ్రిటన్​ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. 17వేల పౌండ్ల అద్దె చెల్లిస్తున్నట్లు ఈ కథనం అంచనా వేసింది.

ఇదీ చూడండి :ఇక్కడ మోసాలు... అక్కడ విలాసాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details