మన అలవాట్లతో పాటు ఆలోచనలను మార్చేసింది కరోనా వైరస్. ఐసోలేషన్ (ఒంటరిగా ఉంచడం), క్వారంటైన్ (నిర్బంధం), లాక్‌డౌన్ వంటి అనుభవాలను నేర్పింది. ఈ క్రమంలో ఔత్సాహికులు కొన్ని కొత్త పదాలను సృష్టించారు. ప్రధానంగా సామాజిక మాధ్యమాలలో నలుగుతున్న కొన్ని కొత్త పదాలివి.
కొవిడియట్
లాక్‌డౌన్ నిబంధనలు పాటించనివారిని ఈ పేరుతో పిలుస్తున్నారు. ఊరికే రోడ్లపై తిరిగేవారు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ఎగబడుతూ సరకులు కొని నిల్వచేసే వారిని ఇలా అంటున్నారు. చేతులు సరిగా శుభ్రం చేసుకోకున్నా, కావాలని గుంపులోకి దూరేస్తున్నా, ఇతరులకు దగ్గరగా వెళ్తున్నా.. అలాంటి వారికీ ఇదే పదం వాడేస్తున్నారు. ఇడియట్ అని చెప్పకనే చెబుతున్నారు.
కొవిడియంట్
ఒబిడియంట్(విధేయుడు)అని అర్థం. లాక్‌డౌన్ సమయంలో బుద్ధిగా మసలుకొనేవారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత, దూరం పాటిస్తున్న వారన్నమాట.
సొలివిగంట్
లాక్‌డౌన్ సమయంలో ఒంటరిగా రాత్రుళ్లు వీధుల్లో తిరుగుతూ కర్ఫ్యూను ఉల్లంఘించేవారు. మేము వేరే వాళ్లకు ఏం హాని చేయడం లేదు కదా అనే భావనలో ఉండేవారిని ఇలా పిలుస్తున్నారు.
హిబీ- జిబీస్
కరోనా తాలూకు భయం, ఆందోళనలతో గడిపేవారు. అదే పనిగా చేతులు కడుగుతుంటారు. వీరు పడే ఒత్తిడి పక్కవారికి సులువుగా తెలిసిపోతుంది. ఒక రకంగా మనలో చాలావరకు హిబీ-బిజీస్‌మే.
స్క్రిప్ట్‌రుయంట్