తెలంగాణ

telangana

ETV Bharat / international

ఓలి భవితవ్యం తేల్చే భేటీ సోమవారానికి వాయిదా

అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. ప్రధాని కేపీ శర్మ ఓలి భవితవ్యంపై చర్చించేందుకు భేటీని తొలుత శనివారం నిర్వహించాలని భావించారు. అయితే ముఖ్య నేతల కోరిక మేరకు తేదీ మార్చారు.

PM Oli
ఓలి

By

Published : Jul 4, 2020, 12:27 PM IST

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భవితవ్యం తేల్చే అధికార నేపాల్​ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్​సీపీ) స్టాండింగ్ కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. తొలుత శనివారమే ఈ భేటీని నిర్వహించాలని భావించినా కొన్ని కారణాల వల్ల తేదీని మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు.

వివిధ సమస్యలపై అవగాహన కోసం ఎన్​సీపీ కీలక నేతలు.. మరింత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు ప్రధాని మీడియా సలహాదారు వెల్లడించారు.

అత్యున్నత కమిటీ..

ఎన్​సీపీ స్టాండింగ్ కమిటీలో 45 మంది సభ్యులు ఉంటారు. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ ఇదే.

భారత్​పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఓలిపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు ఓలి రాజీనామా చేయాలని పార్టీ అధ్యక్షుడితో సహా చాలా మంది నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

ఇదీ చూడండి: నేపాల్ ప్రధాని భవితవ్యం తేలేది శనివారమే!

ABOUT THE AUTHOR

...view details