తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ దేశంలో 1000 దాటిన కరోనా మరణాలు - కరోనా మృతులు ప్రపంచం

ప్రపంచంపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు 4.74కోట్ల కేసులు వెలుగుచూశాయి. 12.13లక్షల మంది మృతిచెందారు. నేపాల్​లో మృతుల సంఖ్య 1000 దాటింది.

Nepal's COVID-19 death toll crosses 1,000
ఆ దేశంలో 1000 దాటిన కరోనా మరణాలు

By

Published : Nov 3, 2020, 8:41 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 4,74,61,740కి చేరింది. 12,13,568మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 3,41,12,441మంది కరోనాను జయించారు.

దేశం కేసులు మృతులు
అమెరికా 95,70,921 2,37,031
బ్రెజిల్​ 55,54,206 1,60,272
రష్యా 16,73,686 28,828
ఫ్రాన్స్​ 14,66,433 37,435
స్పెయిన్​ 13,13,087 36,257
అర్జెంటీనా 11,83,131 31,623
కొలంబియా 10,93,256 31,670
బ్రిటన్​ 10,53,864 46,853
మెక్సికో 9,33,155 92,100

నేపాల్​లో..

నేపాల్​లో మరణాల సంఖ్య తాజాగా 1000 దాటింది. ఇవాళ 20మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మృతుల సంఖ్య 1,004కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 1,79,614కు పెరిగింది.

అయితే కరోనా సంక్షోభం వల్ల నేపాల్​ ఆర్థికపరంగా చిన్నాభిన్నమైంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగింది ఆ దేశ ప్రభుత్వం. దాదాపు 7 నెలల తర్వాత.. హిమాలయ పర్వతాల్లో సాహస యాత్రలకు అనుమతినిచ్చింది.

ఇదీ చూడండి:-కొవిడ్​ రికవరీల్లో భారత్​యే టాప్​.!

శ్రీలంకలో..

శ్రీలంకలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల పునరుద్ధరణ ప్రక్రియను మరో రెండు వారాల పాటు వాయిదా వేసింది అక్కడి ప్రభుత్వం.

పశ్చిమ ప్రావిన్సులో కొత్త క్లస్టర్లు ఏర్పడటం వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత నెలలో స్కూళ్లను మూసివేశారు.

పాకిస్థాన్​ పరిస్థితి..

మరోమారు లాక్​డౌన్​ విధించే స్థితిలో పాకిస్థాన్​ లేదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలు పాటించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రన్​ఖాన్​ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ట్రేసింగ్​, టెస్టింగ్​, క్వారంటైన్​ ప్రక్రియను కఠినతరం చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-కరోనా టీకా వేయించుకున్న యూఏఈ ప్రధాని

ABOUT THE AUTHOR

...view details