నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశ ఆపధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలిని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ) నుంచి తొలగించింది పుష్ప కమల్ ప్రచండ నేతృత్వంలోని పార్టీ అధిష్ఠానం. ఇటీవల ఓలి తీసుకున్న నిర్ణయాలపై స్టాండింగ్ కమిటీ వివరణ కోరగా.. అందులో విఫలమైనందున పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ మేరకు బలూవతార్‌లోని ప్రధాని నివాసానికి ఓ లేఖను పంపింది.
పార్లమెంట్ రద్దు అనంతరం ఓలిని ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన పార్టీ అధిష్ఠానం.. తాజాగా జరిగిన సమావేశంలో పూర్తిగా పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.