చైనా తమ వ్యాపారాలకు భంగం కలిగిస్తోందని నేపాల్ వ్యాపారులు ఆరోపించారు. డ్రాగన్ అనుమతించక పోవడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో 16 నెలలుగా తమ సరకులు నిలిచిపోయాయని వాపోతున్నారు. చైనాతో వ్యాపార స్థితిగతులపై నేపాల్ జాతీయ వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు నరేశ్ కతూవాల్ శుక్రవారం ఈ విషయాలను వెల్లడించారు. చైనా వైఖరిని నిరసిస్తూ నేపాల్ వ్యాపారులు చైనా నుంచి కొనుగోళ్లను రద్దు చేసుకున్నారు.
సరిహద్దు వద్ద స్తంభించిన వాహనాలు "కేరంగ్, తటోపని సరిహద్దుల వద్ద సుమారు 300 కంటెయినర్లు 16 నెలలుగా నిలిచిపోయాయి. ఈ విషయంపై ఇప్పటికే చైనాను అనేక సార్లు సంప్రదించాం. దౌత్యపరంగా ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటుదేమోనని విదేశాంగ శాఖను కూడా సంప్రదించాం. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే చైనాతో వ్యాపారం చేయడం అనవసరం."
-నరేశ్ కతూవాల్, నేపాల్ జాతీయ వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు
వ్యాపారులపై చైనా వడ్డన..
చైనా కొన్ని నెలలుగా నేపాల్ వ్యాపారులకు సరకు రవాణాపై రాకపోకలకు అనుమతించట్లేదు. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేకున్నా 16 నెలలుగా ఇదే వైఖరి కొనసాగిస్తోంది. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల మధ్య 2000 కంటెయినర్లు నిలిచిపోయాయి. ఇప్పటివరకు డ్రాగన్ పరిమిత సంఖ్యలోనే వాహనాలను నేపాల్ సరిహద్దులోకి అనుమతించింది. ఇందుకు అదనంగా చైనా- నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో సరకు రవాణాపై సుంకాన్ని పెంచింది. కంటైనరుకు 7.3 లక్షల వరకు పన్ను విధిస్తున్నారు.
తగ్గిన వ్యాపారం..
చైనాతో నేపాల్ వ్యాపారం క్షీణించిందని స్థానిక ట్రేడ్ యండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సెంటర్ వెల్లడించింది. ఆగునెలల్లో చైనా నుంచి దిగుమతులు 18.5 శాతం తగ్గగా, ఎగుమతులు 50 శాతం తగ్గాయని పేర్కొంది. మరమ్మతు కారణంగా ప్రస్తుతం తటోపని సరిహద్దు మార్గాన్ని రద్దు చేశారు.
ఇదీ చదవండి :అమెరికా మాతో కలిస్తే ఎంతో సాధించొచ్చు: చైనా