నేపాల్ కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవ్బా ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను ప్రధానిగా ప్రకటించాలని రాష్ట్రపతి విద్యా దేవీ భండారీని కోరింది విపక్షాల కూటమి. తమకు 149 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరాయి కూటమిలోని పార్టీలు.
నేపాలీ కాంగ్రెస్(61), మావోయిస్ట్ సెంటర్(48), జేఎస్పీ(13), యూఎంఎల్(27) పార్టీలు తమ ఎంపీల సంతకాలతో కూడిన పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించినట్లు స్థానిక వార్తాసంస్థలు పేర్కొన్నాయి.
దేవ్బా గతంలో వేర్వేరు సందర్భాల్లో.. నాలుగు సార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు.