తెలంగాణ

telangana

ETV Bharat / international

కాలాపానీపై భారత్​తో చర్చలకు ఏర్పాట్లు: నేపాల్​

కాలాపానీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సరిహద్దు సమస్యపై భారత్​తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు నేపాల్​ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య చర్చల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు నేపాల్​ విదేశాంగమంత్రి తెలిపారు.

Nepal preparing for talks with India on Kalapani: FM Gyawali
కాలాపానీపై భారత్​తో చర్చలకు ఏర్పాట్లు: నేపాల్​

By

Published : Dec 31, 2019, 5:21 AM IST

Updated : Dec 31, 2019, 7:26 AM IST

భారత్​, నేపాల్​ దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాస్పద కాలాపానీ అంశంపై భారత్​తో చర్చించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు నేపాల్​ విదేశాంగమంత్రి ప్రదీప్​ గ్యావలి తెలిపారు. ప్రస్తుతం చర్చల కోసం ఒక తేదీని నిర్ణయించే పనిలో ఉన్నట్టు స్పష్టం చేశారు.

సరిహద్దు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపిన నేపాల్​ విదేశాంగమంత్రి.. అదే విషయంపై నవంబర్​ 23న భారత్​కు లేఖ రాసినట్లు వివరించారు. లేఖకు భారత ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు పేర్కొన్నారు.

అయితే ఈ సమస్య వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అనుకోవడం సరికాదన్నారు ప్రదీప్​. భారత్​ దౌత్యపరంగా సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సంబంధాలు ఎందుకు బలహీనపడతాయన్నారు.

ఎందుకీ వివాదం?

జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​​.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించిన అనంతరం భారత్​ కొత్త మ్యాప్​లను విడుదల చేసింది. వీటిలో పీఓకే(పాక్​ ఆక్రమిత కశ్మీర్​)​.. జమ్ముకశ్మీర్​లో, గిల్గిట్​​-బాల్టిస్థాన్​ ప్రాంతం లద్ధాఖ్​​లో ఉన్నాయి. కాలాపానీ, లిపులెక్​ ప్రాంతాలు భారత్​ భూభాగంలో ఉన్నాయి. దీనిపై నేపాల్​ అనేక మార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే భారత దేశ భూభాగంలో ఉన్న ప్రాంతాలనే మ్యాప్​లో పెట్టినట్టు.. నేపాల్​తో ఉన్న సరిహద్దులో ఎలాంటి మార్పులు చేయలేదని భాజపా ప్రభుత్వం వెల్లడించింది.

Last Updated : Dec 31, 2019, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details