భారత్, నేపాల్ మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోయాయని అన్నారు ఆ దేశ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ. సరిహద్దు దేశాలు కష్టాలను, ప్రేమను కూడా పంచుకుంటాయని వ్యాఖ్యానించారు. తొలగిపోయిన అపార్థాల గురించే ఆలోచించకకుండా.. ఇరు దేశాలు భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిపెట్టాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఓలీ.
"సరిహద్దు దేశాల మధ్య సమస్యలు రావడం సహజం. చిలీ, అర్జెంటీనా మధ్య సమస్యలు ఉండట్లేదా? ఇతర దేశాల కన్నా నేపాల్‌కు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ నేపాల్‌కు ఇతర దేశాలతో పోలిస్తే భిన్న రీతిలో భారత్ సాయం అందించాలి. ఇరు దేశాలకు ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి. కాబట్టి నేపాల్‌లోని పలు ప్రాంతాలపై భారత్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది."
-కేపీ శర్మ ఓలీ, నేపాల్ ప్రధాన మంత్రి