తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​లో భారీ వరదలు.. 90కి చేరిన మృతులు - ఆచూకీ గల్లంతు

నేపాల్​లో వరదల ధాటికి ఇప్పటి వరకు సుమారు 90 మంది మృత్యువాత పడ్డారు. మరో 29 మంది ఆచూకీ గల్లంతైంది. సైన్యం సహాయకచర్యలు ముమ్మరం చేసింది.

నేపాల్​లో భారీ వరదలు.. 90కి చేరిన మృతుల సంఖ్య

By

Published : Jul 19, 2019, 7:23 AM IST

నేపాల్​లో భారీ వరదలు.. 90కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న కారణంగా పరిస్థితి మరింత విషమిస్తోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 90కి చేరింది. గల్లంతైన మరో 29 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. వేల మంది నిరాశ్రయులు అయ్యారు.

నేపాల్​లోని మూడు నదులు ఉధ్ధృతంగా ప్రవహిస్తూ... దిగువనున్న బిహార్​లోకి ప్రవేశిస్తున్నాయి. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి . రంగంలోకి దిగిన నేపాలీ సైన్యం ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 3,366 మందిని రక్షించింది. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

ఇదీ చూడండి: పీఎస్​లో ఫిర్యాదు చేసేందుకు ఆదివాసీ 40 కి.మీ నడక

ABOUT THE AUTHOR

...view details