నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య 78కి చేరింది. మరో 40 మంది గాయపడ్డారు. దాదాపు 17,500 మంది నిరాశ్రయులయ్యారు. 25 జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. గత గురువారం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా పరివాహక ప్రాంతాలకు వరదనీరు పోటెత్తి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాధితులకు శరవేగంగా సహాయ చర్యలు చేపడుతున్నారు అధికారులు. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నేపాల్లో ఏకధాటిగా వర్షాలు.. 78కి చేరిన మృతులు - Nepal
కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో హిమాలయ దేశం నేపాల్లో మృతుల సంఖ్య 78కి పెరిగింది. మరో 40 మంది గల్లంతయ్యారు. దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లోని వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నేపాల్లో వరదలు
ఆంటోనియో గుటేరస్ దిగ్భ్రాంతి
నేపాల్లో ప్రస్తుత పరిస్థితిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Last Updated : Jul 17, 2019, 8:03 AM IST