తెలంగాణ

telangana

ETV Bharat / international

120 మందితో లోయలో పడ్డ బస్సు- 11 మంది మృతి - nepal

నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. 108 మంది క్షతగాత్రులయ్యారు.

120 మందితో లోయలో పడ్డ బస్సు- 11 మంది మృతి

By

Published : Oct 12, 2019, 4:53 PM IST

నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుకొని వెళ్తున్న బస్సు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 108మంది గాయపడ్డారు.

పండుగ వేళ విషాదం

హిందూ పండుగ దాషెయిన్(దసరా) ఉత్సవాలు ముగించుకొన్న ప్రయాణికులు సింధుపాల్​చోక్​ నుంచి కాఠ్​​మాండూకు బస్సులో బయలుదేరారు. మలుపు దగ్గర ఓ పక్కకు ఒరిగిపోయిన బస్సు... లోయలో పడిపోయింది. ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 108 మంది గాయపడగా... వారిలో 39 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి : ట్రాఫిక్​ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details