తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ మాజీ ప్రధాని షరీఫ్​ బెయిల్​పై విడుదల

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్..​ జైలు నుంచి విడుదలయ్యారు. వైద్య చికిత్స కోసం 6 వారాల బెయిల్ మంజూరు చేసింది పాకిస్థాన్ సుప్రీంకోర్టు. దేశంలోనే చికిత్స పొందాలని ఆదేశించింది.

By

Published : Mar 27, 2019, 2:58 PM IST

Updated : Mar 27, 2019, 3:57 PM IST

బెయిల్​పై విడుదలైన పాక్ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​

పాక్ మాజీ ప్రధాని షరీఫ్​ బెయిల్​పై విడుదల

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. 69 ఏళ్ల షరీఫ్​ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. షరీఫ్​ అభ్యర్థన మేరకు.. వైద్య చికిత్స కోసం సుప్రీం కోర్టు ఆరు వారాల బెయిల్​ మంజూరు చేసింది. వైద్యం స్వదేశంలోనే పొందాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసిఫ్​ సయీద్​ ఖోసా అధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం షరీఫ్​ పిటిషన్​ను పరిశీలించింది. షరీఫ్​కు అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండ సంబంధిత వ్యాధులు ఉన్న రిత్యా చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దేశం లోపలే చికిత్స పొందడానికి వీలు కల్పిస్తూ న్యాయస్థానం 6 వారాల బెయిల్​ మంజూరు చేసింది. పాకిస్థాన్​ నుంచి విదేశాలకు వెళ్లకుండా షరీఫ్​పై నిషేధం ఉంది.

రెండు బెయిల్ బాండ్లు ఒక్కోటి 5 మిలియన్​ పాకిస్థాన్​ రూపాయలు చొప్పున డిపాజిట్​ చేయాలని సుప్రీం ఆదేశించింది.సరైన పత్రాలు సమర్పించడంలో జాప్యంతో అతని విడుదల పది గంటలు ఆలస్యమైంది. అనంతరం పాక్​ మాజీ ప్రధాని బయటకు రాగానే.. జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వారి అనుచరులు నినాదాలు చేశారు.

నిర్లక్ష్యం చేస్తున్నారు..

పాకిస్థాన్ ముస్లిం లీగ్​ (పీఎమ్​ఎల్​-ఎన్​) అధినేత నవాజ్​కు, ఇటీవల కాలంలోనే నాలుగు సార్లు గుండె పోటు వచ్చిందని, అతని కుమార్తె మరియం నవాజ్​ తెలిపారు. అయినా ఇమ్రాన్​ఖాన్​ ప్రభుత్వం.. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన షరీఫ్​​కు సరైన విద్య చికిత్స అందించడం లేదని ఆమె ఆరోపించారు.

పలు అవినీతి కేసుల్లో నిందితుడు..

నవాజ్ షరీఫ్​పై పలు అవినీతి కేసులు ఉన్నాయి. అవెన్​ఫీల్డ్ ప్రాపర్టీస్-​లండన్​లో అక్రమాస్తులు కేసు, ఫ్లాగ్​షిప్​ పెట్టుబడులు, అల్​ అజీజియా స్టీల్​ మిల్స్​ సంబంధిత కేసులు అతనిపై ఉన్నాయి.

అల్​ అజీజియా స్టీల్​ మిల్​ అవినీతి కేసులో నవాజ్​ షరీఫ్​ 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2018 డిసెంబర్​ నుంచి మూడు నెలలుగా లాహోర్​లోని 'కోట్​ లఖ్పత్​'​ జైలులో ఉంటున్నారు.

ఇదీ చూడండి :నీరవ్​ కోసం లండన్​కు సీబీఐ-ఈడీ బృందం

Last Updated : Mar 27, 2019, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details