ఉత్తర కొరియాలో వర్కర్స్ పార్టీ 8వ కాంగ్రెస్ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. పార్టీ ఎగ్జిక్యూటివ్ పాలసీ కౌన్సిల్‌ను సెక్రటేరియట్‌గా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో కిమ్.. ఆ బాధ్యత చేపట్టినట్లు అక్కడి ప్రభుత్వ వార్త సంస్థ కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) పేర్కొంది. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కేసీఎన్‌ఏ తెలిపింది.
అధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా కిమ్ - ఉత్తర కొరియా వార్తలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అధికార వర్కర్స్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ దేశ ప్రభుత్వ వార్త సంస్థ కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
అధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా కిమ్‌జోంగ్ ఉన్
అంతకుముందు.. కిమ్ తాత, తండ్రి కూడా ఈ బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చూడండి:అమ్మో కిమ్మో.. ఈ అనూహ్య మార్పులేంటయా!