తెలంగాణ

telangana

ETV Bharat / international

అణ్వాయుధాలు, క్షిపణులు మాయం- రూటు మార్చిన కిమ్!

అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ ఆధ్యక్షత ఉత్తర కొరియాలో 73వ జాతీయ వార్షికోత్సవం(north korea parade 2021) అట్టహాసంగా సాగింది. ఈ వేడుకల్లో ఉత్తర కొరియా అణ్వాయుధ సంపదను కాకుండా.. మిలిటరీ సంపదను ప్రదర్శించింది.

n-korea-shows-off-civil-defense-units-in-toned-down-parade
కిమ్​

By

Published : Sep 9, 2021, 3:29 PM IST

ఉత్తర కొరియాలో 73వ జాతీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​(north korea president) నేతృత్వంలో రాజధాని పాంగ్యాంగ్​లోని కిమ్​ ఇల్ సంగ్​ స్క్వేర్​ వద్ద భారీస్థాయిలో దేశ మిలిటరీ సంపద ప్రదర్శన జరిగింది(north korea parade 2021). బుధవారం అర్ధరాత్రి జరిగిన పరేడ్​లో దేశ పారామిలిటరీ దళాలు, ప్రజా భద్రతా దళాలు పాల్గొన్నాయి.

అవకాశం దొరికిన ప్రతిసారీ అణ్వాయుధ బలాన్ని ప్రదర్శించి ఆసియా, అమెరికాకు సవాళ్లు విసిరే అలవాటున్న ఉత్తర కొరియా.. 73వ వార్షికోత్సవంలో మాత్రం వాటిని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా నుంచి బయటకొచ్చిన చిత్రాల్లో మిసైళ్లు ఎక్కడా కనపడలేదు. ఈ దఫా పరేడ్​.. ప్రపంచ దేశాలనుద్దేశించి కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్​ కారణంగా మూతపడ్డ దేశ సరిహద్దు, అమెరికా ఆంక్షల వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థతో ఉత్తర కొరియా ప్రజలు విలవిలలాడుతున్నారు. వారి ముందు బలాన్ని ప్రదర్శించడమే ఈ దఫా ఉత్సవాల ప్రధాన లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

వేడుకల్లో కిమ్​
ఉత్తర కొరియా సైనికులు
భద్రతా దళం
ఉత్తర కొరియా మిలిటరీ పరేడ్​
మిలిటరీ పరేడ్​
కొరియా సైనికులు
ప్రత్యేక వేషధారణలో సైనికులు
కిమ్​ సైన్యం

వేడుకలకు హాజరైన కిమ్​.. మునుపటి కన్నా మరింత సన్నపడ్డారు(kim jong un weight loss). కిమ్​ ఆరోగ్యంపై గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే!

సెల్యూట్​ చేస్తూ...
కిమ్​ బృందం
ఉత్తర కొరియా జెండాతో
ఉత్తర కొరియా సైనికులు
కిమ్​ నేతృత్వంలో..
73వ వార్షికోత్సవం సందర్భంగా..
మిలిటరీ సంపద

ఇదీ చూడండి:-దక్షిణ కొరియాకు కిమ్​ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్

ABOUT THE AUTHOR

...view details