తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా కమాండర్ల మార్పు వెనుక వ్యూహమేంటి? - చైనా అధ్యక్షుడు

చైనా తన ఆర్మీలోని కీలక విభాగాలకు ఇటీవలే కమాండర్లను(China Army New Commanders) మార్చింది. అయితే.. భారత సరిహద్దులోని వెస్టర్న్​ థియేటర్​ కమాండ్​కు(China western theatre command) స్వల్ప కాలంలోనే నలుగురు సారథులను మార్చటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాంతానికి చైనా ఎందుకు అంత ప్రాధాన్యమిస్తోంది? కమాండర్ల మార్పు వెనుక అసలు రహస్యం ఏమిటి?

China's shifting generals in Western Theatre
వెస్టర్న్​ థియేటర్​ కమాండర్​ మార్పు

By

Published : Sep 17, 2021, 10:11 AM IST

భారత్​తో సరిహద్దు ప్రాంతంలోని వెస్టర్న్​ థియేటర్​ కమాండర్​(China western theatre command) బాధ్యతలను స్వల్ప కాలంలోనే పలువురికి అప్పగించింది చైనా. ఇటీవలే కొత్త సారథిని నియమించింది. వెస్టర్న్​ థియేటర్​ కమాండ్​ ప్రాంతంలో తన ఆలోచనలకు విరుద్ధంగా ఏది జరిగినా.. బీజింగ్​ సహించబోదనే వాస్తవాన్ని ఇది సూచిస్తోంది. మరోవైపు వ్యూహాత్మకంగా లబ్ధి పొందేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెస్టర్న్​ థియేటర్​ కమాండ్​ చైనాకు చాలా ముఖ్యమైనది. అక్కడి బలగాలకు తగిన సారథిని నియమించటం చాలా అవసరం కూడా.

10 నెలల్లోపే నలుగురు..

వెస్టర్న్​ థియేటర్​ కమాండ్​(China western theatre commander) బాధ్యతలను ఇటీవలే జనరల్​ వాంగ్​ హైజియాంగ్​కు అప్పగించింది చైనా. 10 నెలల్లోపే నలుగురిని మార్చింది. చైనా సరిహద్దుల్లో ఐదింట్లో.. వెస్టర్న్​ థియేటర్​ భౌగోళికంగా చాలా పెద్దది. భారత్​, అఫ్గానిస్థాన్​, దక్షిణాసియా, సెంట్రల్​ ఆసియాల( కజకిస్థాన్​, కిర్గిస్థాన్​, తజికిస్థాన్) సరిహద్దులకు విస్తరించి ఉంటుంది.

టిబెట్​ మిలిటరీ డిస్ట్రిక్ట్​(టీఎండీ), షింజియాంగ్​ మిలిటరీ డిస్ట్రిక్ట్​ల నిర్వహణను చూసే వెస్టర్న్​ థియేటర్​ కమాండ్​కు జనరల్​ వాంగ్​ హైజియాంగ్​ సరైన వ్యక్తి. ఆయన జనరల్​ జు ఖైలీంగ్​ స్థానంలో నియామకమయ్యారు. ఖైలీంగ్​ 2021, జులైలోనే ఆ పదవి చేపట్టటం గమనార్హం. ప్రస్తుతం 58 ఏళ్లు ఉన్న వాంగ్​ 65 ఏళ్లు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. జనరల్​ జు ఖైలీంగ్​.. 2020, డిసెంబర్​ 19న జనరల్​ జాంగ్​ జుడాంగ్​ స్థానంలో ఈ పదవి చేపట్టారు. ఆయన.. 2020, మేలోనే కమాండర్​గా నియమితులయ్యారు.

చైనా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వెస్టర్న్​ థియోటర్​ కమాండ్​ ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. అయితే.. వేగంగా జరుగుతున్న మార్పులకు పలు అంశాలు కారణమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అవేంటంటే..

  • తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన(India china border dispute) సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసియాలోనే రెండు అతిపెద్ద మిలిటరీ దేశాలు సరిహద్దుల్లో నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరువైపులా సుమారు లక్ష మందికిపైగా బలగాలను మోహరించాయి. అయితే.. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరగటం సానుకూలాంశం. అలాగే.. అత్యంత ప్రతికూల వాతావరణంలో ఏడాది పొడవునా బలగాలను మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గత కమాండర్లు సమర్థంగా విధులు నిర్వర్తించలేరని చైనా భావించినట్లు తెలుస్తోంది.
  • అఫ్గానిస్థాన్​లో తాజా పరిస్థితులు, తాలిబన్లు(Afghanistan Taliban) అధికారం చేజిక్కించుకున్న క్రమంలో తూర్పు తుర్కెమిస్థాన్​ స్వాతంత్ర ఉద్యమం(ఈటీఐఎం)కు చెందిన ఉయ్ఘర్​​-ముస్లిం చొరబాటు దారులు.. చైనాలోని ఉయ్​గుర్​ ప్రాంతంలో తమ కార్యకలాపాలను పెంచే అవకాశం ఉందని డ్రాగన్​ భావిస్తోంది. అలాగే.. అఫ్గాన్​-పాక్​, సెంట్రల్​ ఆసియాల్లోని ఇస్లామిక్​ ఉగ్రవాద ముఠాలు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉన్నట్లు చైనా అంచనా వేస్తోంది. ఉయ్ఘర్ల తిరుగుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
  • చైనా ప్రతిష్టాత్మక బెల్ట్​ అండ్​ రోడ్​ ఇనిషియేటివ్​(బీఆర్​ఐ)లో భాగమైన చైనా-పాకిస్థాన్​ ఎకనామిక్​ కారిడార్​(సీపీఈసీ) పీఓకే ప్రాంతం నుంటే వెళుతోంది. చైనా ఆలోచన ప్రకారం.. ఈ ప్రాజెక్టు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, మిలిటరీ అంశాలపరంగా ముఖ్యమైనది. అందువల్లే వెస్టర్న్​ థియేటర్ ప్రాముఖ్యతను చాటుతోంది.
  • చైనా మిలిటరీలో(People's Liberation Army) చేరేందుకు టిబెట్​ యువత ఆసక్తి చూపించటం లేదని, ఆర్మీలో వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత టిబెట్​, షింజియాంగ్​పై ప్రత్యేక దృష్టి సారించింది చైనా. ఈ రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవల ఓ నివేదికనూ విడుదల చేసింది. ఈ ఏడాది జులై 22, 23 తేదీల్లో టిబెట్​లో ఆకస్మిక పర్యటన చేపట్టారు జిన్​పింగ్​. సరిహద్దు ప్రాంతాలైన నింగ్చీ, లాసాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అధ్యక్షుడి హోదాలో ఆయన టిబెట్​లో పర్యటించటం ఇదే తొలిసారి.
  • హిందూ మహాసముద్ర జలాల్లోకి వెళ్లేందుకు చైనా కొత్తగా అభివృద్ధి చేసిన మార్గాలు పాకిస్థాన్​, మయన్మార్​ నుంచి వెళతాయి. తద్వారా చైనాకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఈ మార్గాల ద్వారా ఆయా ప్రాంతాలపై చైనాకు మంచి పట్టు లభిస్తుంది. అందుకే డబ్ల్యూటీపై ప్రత్యేక దృష్టి సారించింది.
  • చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్(Xi Jinping)​ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టారని లద్దాఖ్​లోని భారత బలగాల కమాండర్​, జనరల్​ రాకేశ్​ శర్మ అభిప్రాయపడ్డారు. షింజియాంగ్​లోని పరిస్థితులను తెలుసుకునేందుకు జనరల్​ వాంగ్​ను 2021 తొలినాళ్లలోనే పంపారని గుర్తు చేశారు. ఆ సమయంలో వాంగ్​ టిబెట్​ మిలిటరీ ప్రాంత కమాండ్​గా విధులు నిర్వర్తించినట్లు చెప్పారు. అలాగే.. పీఎల్​ఏ వ్యూహాత్మక సహాయ దళాలకు కొత్త సారథిని తీసుకొచ్చారని, రాజకీయ కమిషనర్​ను సైతం మార్చినట్లు గుర్తు చేశారు.

సెప్టెంబర్​ 6న జనరల్​ వాంగ్​ను వెస్టర్న్​ థియేటర్​ కమాండర్​గా నియమించటం సహా.. సెంట్రల్​ థియేటర్​ కమాండర్​గా జనరల్​ లిన్​ జియాంగ్యాంగ్​, నేవీ కమాండర్​గా జనరల్​ డాంగ్​ జున్​, వాయుసేన కమాండర్​గా జనరల్​ చాంగ్​ డింగ్యూలను నియమించారు అధ్యక్షుడు జిన్​పింగ్​.

2015 చివర్లో ఏడు ఆర్మీ(china army news) ప్రాంతాలను రద్దు చేసి.. ఐదు థియేటర్​ కమాండ్స్​ను ఏర్పాటు చేసింది చైనా. ఈస్ట్​, సౌత్​, వెస్ట్​, నార్త్​, సెంట్రల్​ థియేటర్​ కమాండ్​లను రూపొందించి.. వాటిని శక్తిమంతమైన చైనా మిలిటరీ కమిషన్​ పరిధిలోకి తీసుకొచ్చింది.

(రచయిత- సంజీవ్​ కుమార్ బారువా)

ఇదీ చూడండి:భారత​ సరిహద్దులో చైనా బలగాలకు కొత్త కమాండర్​

ABOUT THE AUTHOR

...view details