మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు అంతర్జాతీయ సమాజం సహకరించాలని ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి కయావ్ మోతున్ విజ్ఞప్తి చేశారు.
ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన తమ దేశంలో సైనిక తిరుగుబాటును తీవ్రంగా వ్యతిరేకించారు. తాను ప్రజలు ఎనుకున్న పౌర ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహిస్తున్నానని స్పష్టం చేశారు. మియన్మార్‌లో సైనిక పాలన వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇది చదవండి: 'మయన్మార్‌లో పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది'