తెలంగాణ

telangana

ETV Bharat / international

నావల్నీ పిటిషన్​ను తిరస్కరించిన కోర్టు - రష్యా జైలు శిక్ష పిటిషన్ నావల్నీ

జైలు శిక్షకు వ్యతిరేకంగా రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ దాఖలు చేసిన పిటిషన్​ను తిరస్కరించింది మాస్కో కోర్టు. రష్యా నిబంధనల్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో నావల్నీకి రెండు సంవత్సరాల 8 నెలల శిక్ష విధించింది స్థానిక న్యాయస్థానం.

Moscow court rejects opposition leader Navalny's appeal
నావల్నీ పిటిషన్​ను తిరస్కరించిన మాస్కో కోర్టు

By

Published : Feb 20, 2021, 3:44 PM IST

తనపై విధించిన జైలు శిక్షకు వ్యతిరేకంగా రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ దాఖలు చేసిన పిటిషన్​ను మాస్కో సిటీ కోర్టు తిరస్కరించింది. నావల్నీని విడుదల చేయాలని ఐరోపాలోని అత్యున్నత కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. రష్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

గత ఏడాది విష ప్రయోగానికి గురైన నావల్నీ.. జర్మనీలో దాదాపు ఐదు నెలల చికిత్సతో కోలుకున్నారు. ఈ సమయంలో రష్యా విధించిన నిబంధనల్ని నావల్నీ ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఆయనకు రెండు సంవత్సరాల 8 నెలల శిక్ష విధించింది స్థానిక న్యాయస్థానం.

ఈ ఏడాది జనవరి 17న రష్యా చేరుకున్న నావల్నీని విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ అరెస్టు చేశారు. ఈ ఆరోపణలన్నీ అధికార పార్టీ కల్పితాలని నావల్నీ ఖండిస్తున్నారు.

ఇదీ చదవండి:అంగారకుడి ఉపరితలం చిత్రాలను పంపిన రోవర్​

ABOUT THE AUTHOR

...view details