కరోనా పుట్టిన చైనాలో కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ వైరస్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అంతేకాకుండా మరణాలు కూడా చైనా వెలుపలే ఎక్కువగా సంభవించినట్లు డబ్ల్యూహెచ్ఓ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.
చైనా వెలుపలే కరోనా మరణాలు ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ - చైనా కంటే ఇతర దేశాల్లోనే కరోనా వైరస్ కేసులు
చైనా కంటే ఇతర దేశాల్లోనే కరోనా వైరస్ కేసులు, మరణాలు ఎక్కువ నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 6,640 మంది మృతిచెందినట్లు తెలిపారు.
చైనా వెలుపలే కరోనా మరణాలు ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 142 దేశాల్లో లక్షా 69 వేల 710 పైగా కేసులు నమోదవ్వగా... 6,640 మంది మృత్యువాత పడినట్లు స్పష్టం చేశారు టెడ్రోస్. చైనాలో 3,213, ఇటలీలో 1,809, ఇరాన్లో 853, స్పెయిన్లో 297 చొప్పున మరణించినట్లు వివరించారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్!