తెలంగాణ

telangana

ETV Bharat / international

చందమామ వయసు గుట్టు విప్పిన కొత్త పరిశోధన! - earth

చందమామ భూమాతకు తమ్ముడా.. అన్నయ్యా? ఇలా చిన్నపిల్లలు అడిగితే ఏదో చెప్పి తప్పించుకుంటాం. కానీ వారు అడిగే ప్రశ్నలో ఖగోళ రహస్యమే దాగుంది. అవును చంద్రుడి వయసు భూమి పుట్టుకను తెలుసుకునేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. అందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే చందమామ వయసు ఇప్పటివరకు అనుకున్నదానికంటే 100 మిలియన్​ ఏళ్లు ఎక్కువని తేలింది.

మామా వయసెంతో తెలిపిన కొత్త పరిశోధన!

By

Published : Jul 31, 2019, 5:31 AM IST


సౌర కుటుంబం ఏర్పడిన 50మిలియన్​ సంవత్సరాల తర్వాత చంద్రమండలం ఏర్పడిందని సరికొత్త పరిశోధనలో తేలింది. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు అంచనా వేసిన వయసుకన్నా ఎన్నో ఏళ్లు ఎక్కువ వయసు ఉంటుందని వారు కనుగొన్నారు.
తాజాగా జర్మనీలోని కలోన్ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనా ఫలితాల ప్రకారం దాదాపు 4.56 బిలియన్​ ఏళ్ల క్రితమే చందమామ ఏర్పడినట్లు ఆధారాలున్నాయని తెలిసింది. ఇది వరకు సౌర కుటుంబం ఏర్పడ్డ 150 ఏళ్ల తర్వాతే చందమామ ఏర్పడిందని అంతా అనుకున్నారు. అయితే... సౌర కుటుంబం ఏర్పడిన 50 మిలియన్​ ఏళ్లకే జాబిల్లి రూపుదాల్చిందని శాస్త్రవేత్తలు తాజాగా స్పష్టం చేశారు.
1969లో చంద్రుడిపై అడుగుపెట్టిన అపోలో మిషన్​ బృందం 21.55కిలోల నమూనాలను భూమికి పట్టుకురాగా ఇప్పటికీ వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

"వివిధ కాలాల్లో ఏర్పడిన రాళ్లలోని రకరకాల రసాయన గుణాలను పోల్చిచూడడం ద్వారా చంద్రుడి అంతర్భాగం, ఘన పదార్థంగా మారిన తీరుకు సంబంధించిన అశాలు తెలుస్తాయి."
-రావుల్​ ఫొన్సెకా, పరిశోధకుడు.

భూమాత పుట్టుక గురించి తెలుసుకోవడంలో చందమామ వయసు చాలా కీలకం. అందుకే ఈ పరిశోధనకు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:వేలితో కుస్తీ పోటీలు..మీరూ ఓ లుక్కేయండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details