రుతుపవనాల కారణంగా పాకిస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల ధాటికి 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఖైబర్ పంఖ్తుఖ్వా రాష్ట్రంలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడి 12 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. చిత్రాల్ జిల్లాలో చైనా ఇంజినీర్లు పని చేస్తున్న లవారి సొరంగం పూర్తిగా మునిగిపోయింది. వారిని సురక్షితంగా బయటికి తీశారు. కోహిస్థాన్ జిల్లా సింధు నదిలో వాహనం కొట్టుకుపోయిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.