తెలంగాణ

telangana

ETV Bharat / international

కుదిరితే వరాహాలతో ఆడుకుంటూ ఓ కప్పు​ కాఫీ! - tokyo

జపాన్​ రాజధాని టోక్యో నగరంలో పందులతో సందడి చేస్తోన్న ఓ కేఫ్​ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ ఉండే బుల్లి బుల్లి వరాహాలతో ఆడుకుంటూ కాఫీ, టీ తాగేందుకు టోక్యో వాసులతో పాటు పర్యటకులూ ఉత్సాహం చూపుతున్నారు.

కుదిరితే వరాహాలతో ఆడుకుంటూ ఓ కప్పు​ కాఫీ!

By

Published : May 18, 2019, 8:02 AM IST

మిపిగ్ కేఫ్

జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన 'మిపిగ్​ (మైక్రో పిగ్​) కేఫ్'​ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కేఫ్​ ఏంటి?... ఆకర్షించడమేంటని అనుకుంటున్నారా?... అయితే ఇది అన్నింటిలా అందంగా, శుభ్రంగా ఉండే కేఫ్​ మాత్రమే కాదు. ఈ కేఫ్​లో చిన్న చిన్న పంది పిల్లలు సందడి చేస్తాయి. ఇక్కడికి వచ్చే వినియోగదారుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. చూడముచ్చటగా ఉండే బుల్లి వరాహాలను చూస్తూ కాఫీ, టీలు తాగుతూ సేదతీరుతున్నారు టోక్యో వాసులు. జపాన్ వ్యాప్తంగా మాత్రమే కాదు టోక్యో నగరానికి వచ్చే పర్యటకులూ ఈ బుల్లి వరాహాలకు ముగ్ధులైపోతున్నారు. 40 కేజీల దాకా బరువు పెరిగే ఈ పందులను 'టీకప్​ వరాహాలు' అని కూడా పిలుస్తారు. ఇంతటి చూడముచ్చటైన వరాహాలతో ఆడుకుంటూ కాఫీ తాగాలంటే 30 నిమిషాలకు 8 అమెరికన్​ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది.

యూకే నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ వరాహాలు అత్యంత ఖరీదైనవే. ఒక్కో వరాహం ధర దాదాపు 3 వేల అమెరికన్​ డాలర్ల వరకు ఉంటుంది. ఇటీవల ఈ చిన్న పందులకు డిమాండ్​ మరింత పెరిగింది. ఇప్పటికీ 100 మంది ఈ పందుల కోసం వేచిచూస్తున్నట్లు 'మిపిగ్'​ అధికారి షిహో కితాగవా తెలిపారు. అయితే వీటిని వాళ్లందరికీ అందించేందుకు 2020 దాకా వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details