Man survives lightning strike: పిడుగుపాటుకు గురైన తర్వాత బతకడం అంటే.. అత్యంత అరుదుగా మాత్రమే జరిగే విషయం. ఇండోనేసియాలోనూ ఇలాంటి ఓ అరుదైన సంఘటన జరిగింది. పిడుగు పడినప్పటికీ.. ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
గొడుగుతో వెళ్తుండగా..
Indonesia lightning strike: జకార్తాలోని ఓ పరిశ్రమలో 35 ఏళ్ల వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. డ్యూటీలో ఉన్న సమయంలో అతనిపై పిడుగు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఆ సెక్యూరిటీ గార్డు.. వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని నడుస్తూ ఉండడం ఆ వీడియోలో కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత అతనిపై పిడుగు పడింది. ఆ సమయంలో భారీగా మెరుపులు కనిపించాయి. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత.. సహోద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చి.. అతడ్ని ఆస్పత్రికి తరలించారు.