తనను వదిలేసిన ఓ యువతిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడో వ్యక్తి. కొత్త ప్రియుడితో శృంగారం చేశావా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో, కత్తితో బెదిరింపులకు పాల్పడి చివరకు ఆమెపై అత్యాచారం చేశాడు. సింగపూర్‌లో జరిగిందీ ఘటన.
స్కూల్లోనే లవ్..
నిందితుడు పదో తరగతిలో ఉన్నప్పుడు.. 14 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. అతడికి అప్పుడు 16 సంవత్సరాలు. ఆ వయసు నుంచే ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. ఆమెతో శృంగారం చేయగా, 14 ఏళ్ల వయసులో ఓసారి, 23 ఏళ్ల వయసులో మరోసారి బాధితురాలు గర్భవతి అయింది. కానీ.. రెండుసార్లు అబార్షన్ చేయించుకుంది.
మోసం చేశాడని విడిపోయి..
నిందితుడు తనను మోసం చేశాడని 2019 ఫిబ్రవరి 11న అతడితో విడిపోయింది బాధితురాలు. దీనిని జీర్ణించుకోలేని ఆ యువకుడు మాత్రం మళ్లీ కలవాలని కోరుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి అతడి వాట్సాప్‌ను బ్లాక్ చేసింది. కానీ.. ఆమెను కలిసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ.. అవేమీ ఫలించలేదు.
విడిపోయిన రెండు వారాల తర్వాత.. ఆమెకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పగా నిరాకరించింది. కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రపన్నాడు.
ఇంటికి వెళ్లి కాపుగాసి..
ఓరోజు అర్ధరాత్రి సమయంలో.. ఆమె ఇంటికి వెళ్లి కాపుగాశాడు. ఆ యువతి రాగానే మాట్లాడుకునేందుకు హోటల్‌కు వెళ్దామని చెప్పగా.. అతడిని నమ్మి వెంటవెళ్లింది. అప్పుడే ఆమె చేతికి ఉంగరం చూసి బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్షమించమని బాధపడ్డ యువతి.. ఒంటిగంట సమయంలో అతడితో కలిసి ఇంటికి వెళ్లింది.
ముందే తను కొనుగోలు చేసిన ఓ కత్తితో.. ఆమెను బెదిరించాడు. మరొకరితో సెక్స్ చేశావా అంటే నో అని బదులిచ్చిందా యువతి. మెడ దగ్గర కత్తి పెట్టి చెప్పమని గట్టిగా అరిస్తే ప్రాణభయంతో.. ఔనని ఒప్పుకుంది.
నన్నే పెళ్లి చేసుకోవాలి..
అప్పుడే మరో ప్లాన్ వేసిన నిందితుడు.. ఆమెతో సెక్స్ చేస్తే ప్రెగ్నెంట్ అవుతుందని, అప్పుడు తనను పెళ్లిచేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. యువతి తొడలపై కత్తిగాట్లు పెట్టి.. అత్యాచారం చేశాడు. చివరకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో వివరాలు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయించింది.
గురువారం ఉదయం అతడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అతడికి 13 ఏళ్ల జైలు శిక్ష విధించాలని బాధితురాలి తరఫు న్యాయవాది కోరారు. అయితే ఆ యువతికి ఇప్పటికీ నిందితుడిపై ప్రేమ ఉందని, సామాజిక మాధ్యమాల్లో దానిని వ్యక్తపరుస్తూనే ఉందని కోర్టుకు వివరించారు డిఫెన్స్ లాయర్. శిక్షను సగానికి తగ్గించాలని కోరారు.
బాధితురాలు లైంగిక వేధింపులకు పాల్పడితే ప్రేమ అని ఎలా అంటారని ప్రశ్నించిన జడ్జి.. కేసు విచారణను వాయిదా వేశారు.
ఇవీ చూడండి:ఉద్యోగి మనసు విరిగింది.. 'ది గ్రేట్ రెజిగ్నేషన్' సునామీ మొదలైంది!
Car Runs On Wine: మద్యం తాగి పరుగులు తీస్తున్న యువరాజు కారు